Amit Shah: వరుస రైలు ప్రమాదాలపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

conspiracy will not last long says Shah

  • రైలు ప్రమాదాల వెనుక కుట్రలు దాగి ఉంటే వెలికి తీస్తామని వ్యాఖ్య
  • ఎలాంటి కుట్రలు అయినా ఎక్కువ రోజులు దాగి ఉండవన్న అమిత్ షా
  • ప్రమాదాల మూల కారణాలపై దర్యాఫ్తు చేస్తామన్న అమిత్ షా

వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రైలు ప్రమాదాల వెనుక ఏవైనా కుట్రలు, కుతంత్రాలు దాగి ఉంటే వెలికి తీస్తామన్నారు. ప్రభుత్వ పనితీరుపై ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏ విషయంలోనైనా ఎలాంటి కుట్రలైనా ఉంటే ఎక్కువ రోజులు దాగి ఉండవన్నారు. 1.10 లక్షల కిలోమీటర్ల రైల్వే నెట్ వర్క్ పరిరక్షణకు తమ ప్రభుత్వం అతి త్వరలో కీలక చర్యలు తీసుకోనుందన్నారు.

రైల్వే భద్రత విషయమై మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో చర్చించినట్లు తెలిపారు. రైల్వే ప్రమాదాల విషయానికి వస్తే వాటి మూల కారణాలపై దర్యాఫ్తు చేస్తామన్నారు. కారణం ఏదైనా ప్రభుత్వం వీటిపై దృష్టి సారిస్తోందన్నారు. ఇది కుట్ర అయితే ఎక్కువ కాలం కొనసాగదని స్పష్టం చేశారు. లోపాలు ఉంటే మాత్రం సరి చేస్తామని తెలిపారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.

మోదీ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో 38 రైలు ప్రమాదాలు జరిగాయని ప్రతిపక్షం ఆరోపిస్తోందని, కానీ అవన్నీ చిన్న ఘటనలే అని స్పష్టం చేశారు. ఈ వంద రోజుల్లో ఎనిమిది కొత్త రైల్వే ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేశామన్నారు. ఈ ప్రాజెక్టులతో దాదాపు 4.42 కోట్ల మానవ పనిదినాల ఉపాధి లభిస్తుందన్నారు. 

కాగా, కొన్నిరోజులుగా దుండగులు రైల్వే పట్టాలపై ఎల్పీజీ సిలిండర్లు, సైకిళ్లు, ఇనుపరాడ్లు, సిమెంట్ ఇటుకలను పెట్టి రైలు ప్రమాదాలు జరిగేలా దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి అంశాలపై అమిత్ షా స్పందించారు.

  • Loading...

More Telugu News