Atishi: ఎన్నికలు అయ్యేంత వరకే నేను ముఖ్యమంత్రిగా ఉంటాను... ఆ తర్వాత మళ్లీ కేజ్రీవాలే: ఢిల్లీ కొత్త సీఎం అతిశీ

Atishi thanks Arvind Kejriwal after being elected next CM of Delhi

  • వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించాక కేజ్రీవాల్ సీఎంగా బాధ్యతలు చేపడతారన్న అతిశీ
  • ఇతర పార్టీల్లో ఉంటే తనకు టిక్కెట్ కూడా దక్కకపోయేదని వ్యాఖ్య
  • కేజ్రీవాల్ మాత్రం తనను ఎమ్మెల్యే స్థాయి నుంచి సీఎంగా చేశారన్న అతిశీ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగేంత వరకు మాత్రమే తాను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటానని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించాక మళ్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ బాధ్యతలు చేపడతారని అతిశీ అన్నారు. 

తదుపరి ఢిల్లీ సీఎంగా ఎంపికైన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... తాను ఇతర పార్టీల్లో ఉన్నట్లయితే కనీసం టిక్కెట్ కూడా దక్కకపోయేదన్నారు. కానీ కేజ్రీవాల్ తనకు టిక్కెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేసి, ఆ తర్వాత మంత్రిని చేసి, ఇప్పుడు ముఖ్యమంత్రిని చేశారని వెల్లడించారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు కేజ్రీవాల్‌కు ధన్యవాదాలు తెలిపారు.

తనపై నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించారన్నారు. ఇలాంటి అవకాశం కేవలం ఆమ్ ఆద్మీ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తనకు ఈ అవకాశం కల్పించారని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయడం తనకు ఎంతో బాధ కలిగించిందన్నారు. తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టానని అభినందించవద్దని, పూలమాలలు అవసరం లేదని సూచించారు. ఎన్నికల తర్వాత మళ్లీ కేజ్రీవాల్ సీఎం అవుతారన్నారు. 

మద్యం పాలసీ కేసులో తప్పుడు ఆరోపణలతో కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పు కేంద్రంలోని బీజేపీకి, దర్యాఫ్తు సంస్థలకు చెంపపెట్టు అన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమం అని అన్నారు. కేజ్రీవాల్ స్థానంలో మరొకరు ఉంటే పదవిని వదులుకునే వారు కాదన్నారు.

  • Loading...

More Telugu News