Jhonny Master: జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు... స్పందించిన చిత్రపరిశ్రమ
- కేసు విషయమై మాట్లాడిన లైంగిక వేధింపుల పరిష్కార ప్యానల్ సభ్యులు
- లైంగిక వేధింపులపై బాధితురాలు మొదట మీడియాను ఆశ్రయించిందని వెల్లడి
- ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతుందని వెల్లడి
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు మీద ఫిలిం ఛాంబర్‌కు చెందిన లైంగిక వేధింపుల పరిష్కార ప్యానల్ ఈరోజు స్పందించింది. తమ్మారెడ్డి భరద్వాజ, ఝాన్సీ, ఇతర ప్యానల్ సభ్యులు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఝాన్సీ మాట్లాడుతూ... లైంగిక వేధింపులకు సంబంధించి బాధితురాలు మొదట మీడియాను ఆశ్రయించిందన్నారు. మీడియా ద్వారా ఈ విషయం తమ దృష్టికి వచ్చినట్లు చెప్పారు.
చాంబర్ ను ఆశ్రయించినప్పుడు, తాను పని చేసే ప్రదేశంలో వేధింపులు ఉన్నాయని మొదట చెప్పింది, ఆ తర్వాత లైంగిక వేధింపుల గురించి వెల్లడించిందన్నారు. ఈ కేసుకు సంబంధించి లీగల్‌గా విచారణ సాగుతోందన్నారు.
అవకాశాలు పోతాయనే భయంతో చాలామంది తమకు ఎదురైన పరిస్థితులను చెప్పడం లేదన్నారు. ప్రతిభ ఉంటే ఇండస్ట్రీలో ఎప్పుడూ అవకాశాలు ఉంటాయన్నారు.
జానీ మాస్టర్‌పై బాధితురాలు ఫిర్యాదు చేయగా రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత దానిని నార్సింగి పీఎస్‌కు బదిలీ చేశారు. నార్సింగి పోలీసులు ఈ కేసుపై విచారణ జరుపుతున్నారు.