Narendra Modi: మోదీకి చంద్రబాబు, రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

Chandrababu and Revanth Reddy greetings to PM Modi

  • నేడు ప్రధాని మోదీ పుట్టినరోజు
  • మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతూనే ఉంటుందన్న చంద్రబాబు
  • దేశాన్ని పురోగతి దిశగా నడిపించే మనోబలాన్ని మోదీకి భగవంతుడు ఇవ్వాలన్న రేవంత్

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు శుభాకాంక్షలు తెలిపారు. 

"గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. దేశ సేవ చేసేందుకు ఆయనకు మంచి ఆరోగ్యాన్ని, సంపూర్ణ జీవితాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. మోదీ విజనరీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది" అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

"గౌరవనీయులైన ప్రధాని మోదీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మన దేశాన్ని పురోగతి దిశగా నడిపించేలా ఆయనకు మనోబలాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను" అని రేవంత్ ట్వీట్ చేశారు.

Narendra Modi
BJP
Chandrababu
Telugudesam
Revanth Reddy
Congress
  • Loading...

More Telugu News