Actor Dhanush: ధనుష్‌ దర్శకత్వంలో మరో సినిమా!

Another movie directed by Dhanush

  • రాయన్‌ తరువాత ధనుష్‌ అంగీకరించిన చిత్రం 
  • కొత్త సంస్థకు నిర్మాణ అవకాశం 
  • ధనుష్‌ దర్శకత్వం వహించే అవకాశం 

తమిళ కథానాయకుడు ధనుష్‌ నటనలోనే కాకుండా దర్శకత్వంలో కూడా తన ప్రతిభను చూపిస్తున్నాడు. ఇటీవల ఆయన నటించి, దర్శకత్వం వహించిన చిత్రం 'రాయన్‌'తో మంచి ప్రశంసలే అందుకున్నాడు. ప్రస్తుతం నటుడిగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న పలు ప్రాజెక్టులతో ధనుష్ బిజీగా వున్నాడు. 

ఈ కోలీవుడ్‌ కథానాయకుడు తెలుగు దర్శకుడు శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో కుబేర అనే చిత్రంలో కూడా నటిస్తున్నాడు. అక్కినేని నాగార్జున ఈ చిత్రంలో ముఖ్యపాత్రను చేస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్న ఈ చిత్రంలో హీరోయిన్‌. తెలుగు నిర్మాణ సంస్థ ఏషియన్‌ ఫిలిమ్స్‌ పతాకంపై సునీల్‌ నారంగ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

కాగా 'రాయన్‌'తో అందరి మెప్పు పొందిన ధనుష్‌ ఇదే ఎనర్జీతో మరో చిత్రంలో నటించడానికి అంగీకరించాడు. రా అండ్‌ రస్టిక్‌ ఫిల్మ్‌గా తెరకెక్కించిన రాయన్‌ చిత్రం కమర్షియల్‌గా ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా దర్శకుడిగా ధనుష్‌ మేకింగ్‌కు, యాక్టింగ్‌కు మంచి మార్కులే పడ్డాయి. 

కాగా ధనుష్‌ తాజా సినిమాకు  సంబంధించిన అధికారిక ప్రకటన మంగళవారం వెలువడింది. డాన్‌ ప్రొడక్షన్స్‌ అనే నూతన నిర్మాణ సంస్థలో ఆయన తన కెరీర్‌లో 52వ చిత్రాన్ని అంగీకరించాడు. అయితే ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహించనున్నారు... ఎలాంటి కాన్సెప్ట్‌తో ఈచిత్రం రాబోతుందనే వివరాలు తెలియాల్సి వుంది. అయితే ఈ చిత్రం కూడా నటుడు ధనుష్‌ దర్శకత్వంలోనే రూపొందే అవకాశం వుందని కోలీవుడ్‌ సినీ వర్గాలు అంటున్నాయి.

Actor Dhanush
Dhanush latest movie
KOLLYWOOD
Tollywood
  • Loading...

More Telugu News