Tito Jackson: గుండెపోటుతో పాప్‌స్టార్ మైఖేల్ జాన్సన్ సోదరుడి మృతి

Tito Jackson Michael Jackson brother and member dies at 70

  • న్యూ మెక్సికో నుంచి ఒక్లహోమాకు కారులో వెళ్తుండగా టిటో జాక్సన్‌కు గుండెపోటు!
  • జాక్సన్ 9 మంది సోదరుల్లో టిటో మూడోవాడు
  • ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించిన టిటో కుమారులు

గ్లోబల్ పాప్‌స్టార్ మైఖేల్ జాక్సన్ 9 మంది సోదరుల్లో ఒకరైన టిటో జాక్సన్ గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. జాక్సన్ సోదరుల్లో టిటో మూడో వాడు. ‘జాక్సన్ 5’ టీంలో ఒకరు. తమ ప్రియమైన తండ్రి రాక్ అండ్ రోల్ హాల్ ఆఫ్ ఫేమర్ టిటో జాక్సన్ ఇప్పుడు తమతో లేరని తాము బరువెక్కిని హృదయాలతో తెలియజేస్తున్నామని ఆయన కుమారులు టీజే, తాజ్, టారిల్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ద్వారా తెలిపారు. ఆయన తామందరి గురించి, శ్రేయస్సు గురించి పట్టించుకునే అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు. 

టిటో జాక్సన్ మరణాన్ని తొలుత ‘ఎంటర్‌టైన్‌మెంట్ టునైట్’ నివేదించింది. ఆయన మరణానికి కారణం తెలియనప్పటికీ గుండెపోటుతోనే ఆయన మరణించినట్టు పేర్కొంది. న్యూ మెక్సికో నుంచి ఒక్లహోమాకు కారులో వెళ్తుండగా ఆయన గుండెపోటుకు గురైనట్టు జాక్సన్ కుటుంబ మాజీ మేనేజర్ మానింగ్ తెలిపారు.

More Telugu News