Dummy Bomb: సీఎం రేవంత్ వెళ్లే దారిలో డమ్మీ బాంబు

Dummy bomb identified in CM Revanth Reddy convoy route

  • ఈ నెల 15వ తేదీన నలుపు రంగు బ్యాగ్ లభ్యం
  • బ్యాగులో డమ్మీ బాంబు గుర్తింపు
  • సినిమా షూటింగుల కోసం బాంబును సిద్ధం చేశారన్న పోలీసులు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణించే దారిలో డమ్మీ బాంబు కలకలం రేపింది. ఆయన కాన్వాయ్ ప్రయాణించే జూబ్లీహిల్స్ దారిలో ఈ నెల 15వ తేదీన నలుపు రంగు బ్యాగ్ దొరికింది. దీన్ని సీఎల్ డబ్ల్యూ అధికారులు స్వాధీనం చేసుకుని వారి కేంద్ర కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ బ్యాగును పరిశీలించగా అందులో డమ్మీ బాంబు ఉన్నట్టు గుర్తించారు. అయితే, ఆ ప్రాంతానికి ఆ బ్యాగు ఎలా వచ్చిందనే దానిపై పోలీసులు లోతైన దర్యాప్తును ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. సినిమా షూటింగుల కోసం డమ్మీ బాంబును సిద్ధం చేసినట్టు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News