Pawan Kalyan: నిస్వార్థ కర్మయోగి, సాటిలేని సాధకుడికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

AP Deputy CM Pawan Kalyan Birthday Wishes to PM Modi

  • నేడు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ 74వ పుట్టిన‌రోజు
  • సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌ధానికి ప‌లువురు ప్ర‌ముఖుల‌ శుభాకాంక్ష‌లు 
  • 'ఎక్స్' ద్వారా బ‌ర్త్ డే విషెస్ తెలిపిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌

నేడు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ 74వ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) ద్వారా బ‌ర్త్ డే విషెస్ తెలిపారు. 

"నా స్ఫూర్తి, ప్రపంచ నాయకుడు, నిస్వార్థ కర్మయోగి, సాటిలేని సాధకుడు గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పుట్టిన‌రోజు శుభాకాంక్షలు. హృదయపూర్వక అభినందనలు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, క్షేమంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని వేంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. 

మీరు దేశభక్తికి ప్రతిరూపం. మీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ శాంతి, శ్రేయస్సు, శక్తికి కేంద్రంగా ఉద్భ‌వించింది. భార‌త విజయవంతమైన ప్రధానిగా ఉదారమైన, శాంతియుతమైన, సమానమైన ప్రపంచాన్ని నిర్మించడంలో ప్రముఖ పాత్ర పోషించడం ద్వారా ఇండియాను మళ్లీ విశ్వ గురువుగా తీసుకెళ్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. 

అది జరగడానికి మార్గం సుగమం చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా వలసపోతున్న కోట్లాది మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలు, శుభాకాంక్షలు ఎల్లప్పుడూ మీతో ఉంటాయి. ప్రియమైన ప్రధానమంత్రి, మీకు మళ్లీ మీ పుట్టినరోజు శుభాకాంక్షలు!" అని జ‌న‌సేనాని ట్వీట్ చేశారు.

More Telugu News