Ram Charan: కొత్త సినిమా కోసం రామ్ చరణ్ సన్నాహాలు

Ram Charan starts preparations for RC 16

  • ప్రస్తుతం గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్న రామ్ చరణ్
  • డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు వస్తున్న భారీ బడ్జెట్ మూవీ
  • బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఆర్సీ16కి కమిట్ అయిన రామ్ చరణ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి రామ్ చరణ్ షూటింగ్ పార్ట్ పూర్తయింది. ఈ సినిమా డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. గేమ్ చేంజర్ రామ్ చరణ్ కు 15వ చిత్రం కాగా, 16వ సినిమా కూడా ఖరారైంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ నటించనున్నారు. 

తాజాగా, ఈ సినిమా (ఆర్సీ16) కోసం రామ్ చరణ్ అప్పుడే సన్నాహాలు మొదలుపెట్టేశారు. చిత్రబృందం ఈ మేరకు రామ్ చరణ్ బ్యాక్ లుక్ తో ఓ ఫొటో రిలీజ్ చేసింది. తన పాత్ర కోసం రామ్ చరణ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు అంటూ సుకుమార్ రైటింగ్స్ చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పేర్కొంది. 

త్వరలోనే షూటింగ్ ప్రారంభవుతుందని వెల్లడించింది. 'ఆర్సీ16' ఓ మెగా మాసివ్ మూవీ అంటూ చరణ్ ఫ్యాన్స్ కు క్రేజీ కబురు చెప్పింది. కాగా ఈ చిత్రంలో రామ్ చరణ్ ఓ క్రీడాకారుడిగా కనిపించనున్నట్టు తెలుస్తోంది.

More Telugu News