Vikranth: హారర్ ను మించి వణికిస్తున్న 'సెక్టార్ 36'

Sector 36 Movie Update

  • నేరుగా ఓటీటీకి వచ్చిన 'సెక్టార్ 36'
  • క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ 
  • 2006లో నోయిడా వరుస హత్యల నేపథ్యం
  • భయపెడుతున్న హింస - రక్తపాతం


సాధారణంగా హారర్ సినిమాలు భయపెడుతుంటాయి. ఏ వైపు నుంచి ఏం జరుగుతుందా అనే భయంతో ప్రేక్షకులు వణికిపోతుంటారు. రాత్రికి అవే సీన్స్ గుర్తొస్తాయని కొంతమంది ఈ తరహా సినిమాలకు దూరంగా ఉంటారు. మరికొంతమంది తోడు చూసుకుని మరీ ఈ సినిమాలు చూస్తుంటారు. అయితే హారర్ జోనర్ కాకపోయినా ఇప్పుడు ఒక సినిమా ప్రేక్షకులను భయపెడుతోంది. ఆ సినిమా పేరే 'సెక్టార్ 36'. 

విక్రాంత్ మాసే ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందింది. దినేశ్ - జ్యోతి నిర్మించిన ఈ సినిమాకి ఆదిత్య నింబాల్కర్ దర్శకత్వం వహించాడు. దీపక్ దోబ్రియాల్ .. ఆకాశ్ ఖురాన ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ సినిమాను ఈ నెల 13వ తేదీన నేరుగా నెట్ ఫ్లిక్స్ వేదికపైకి తీసుకుని వచ్చారు. హిందీతో పాటు తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. 

2006లో నోయిడాలో జరిగిన వరుస హత్యల నేపథ్యంలో నడిచే కథ ఇది. ప్రేమ్ సింగ్ అనే వ్యక్తి చిన్నప్పుడు తనకి ఎదురైన పరిస్థితుల కారణంగా సైకోగా మారిపోతాడు. మురికి ప్రాంతానికి చెందిన పిల్లలను కిడ్నాప్ చేసి .. వాళ్లను అత్యంత దారుణంగా చంపుతుంటాడు. ఆ తరువాత వాళ్ల అవయవాలను అక్రమంగా అమ్ముతుంటాడు. హత్యలు జరిగే తీరు ప్రేక్షకులను భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఆ హింసను .. రక్తపాతాన్ని తట్టుకోవడానికి చాలా ధైర్యం కావాలనే మాటనే సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. 

  • Loading...

More Telugu News