Aditi Rao Hydari: పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి

Heroine Aditi Rao Hydari Married Hero Siddharth

  • ఇటివ‌లే నిశ్చితార్థం చేసుకున్న సిద్ధార్థ్, అదితి
  • తాజాగా కుటుంబ స‌భ్యులు, బంధువుల మ‌ధ్య ఘ‌నంగా వివాహం
  • వ‌న‌ప‌ర్తిలోని ఆల‌యంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన జంట‌
  • పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్న న‌టీన‌టులు
  • నూత‌న జంట‌కు నెటిజ‌న్ల శుభాకాంక్ష‌లు 

హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ పెళ్లి చేసుకున్నారు. కొంత‌కాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్ద‌రూ ఇటీవ‌లే నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా కుటుంబ స‌భ్యులు, బంధువుల మ‌ధ్య ఘ‌నంగా వ‌న‌ప‌ర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగ‌నాయ‌క‌స్వామి ఆల‌యంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లి దక్షిణాది సంప్రదాయం ప్రకారం జరిగింది. 

ఈ జంట తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. "నువ్వు నా సూర్యుడు, నా చంద్రుడు.. అలాగే నువ్వే నా తారాలోకం. మిసెస్ అండ్ మిస్ట‌ర్ అదు సిద్ధు" అని అందమైన క్యాప్షన్‌తో అదితి రావు హైదరీ తమ పెళ్లి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. దాంతో ఈ నూత‌న జంట‌కు నెటిజ‌న్లు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. 

ఇక సిద్ధార్థ్‌తో రిలేష‌న్‌పై అదితి ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. తామిద్ద‌రం జంట‌గా న‌టించిన మ‌హా స‌ముద్రం సినిమా షూటింగ్ స‌మ‌యంలో త‌మ మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం, ఆ త‌ర్వాత ప్రేమ‌గా మారింద‌ని ఆమె చెప్పారు. హైద‌రాబాద్‌లో త‌న త‌ల్లి ప్రారంభించిన స్కూల్ అంటే త‌న‌కెంతో ఇష్ట‌మ‌న్న అదితి.. అక్క‌డే త‌న‌కు సిద్ధూ ప్ర‌పోజ్ చేయ‌డంతో కాద‌న‌లేక‌పోయాన‌ని చెప్పుకొచ్చారు. ఆమె ఆశీస్సుల కోస‌మే తాను అక్క‌డ ప్ర‌పోజ్ చేసిన‌ట్లు ఆ త‌ర్వాత సిద్ధార్థ్ చెప్పాడ‌ని ఆమె తెలిపారు.

View this post on Instagram

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari)

Aditi Rao Hydari
Siddharth
Wedding
  • Loading...

More Telugu News