Bigg Boss Telugu 8: బిగ్ బాస్ హౌస్ నుంచి న‌న్ను ఎవ‌రూ బ‌య‌ట‌కు పంప‌లేదు.. నేనే వ‌చ్చేశాను: శేఖ‌ర్ బాషా

Shekhar Basha says I Came out on my Wwn Decision from Bigg Boss Telugu 8

  • ర‌సవ‌త్త‌రంగా బిగ్ బాస్ తెలుగు సీజ‌న్-8 
  • ఆదివారం రెండో ఎలిమినేష‌న్‌లో బ‌య‌ట‌కు వ‌చ్చేసిన శేఖ‌ర్ బాషా
  • ఇది బిగ్ బాస్ చ‌రిత్ర‌లోనే తొలి హ్యాపీ ఎమిలినేష‌న్ అన్న బాషా
  • ఇటీవ‌ల పుట్టిన త‌న కొడుకును చూడ‌టానికి తానే బ‌య‌ట‌కు వ‌చ్చేశానని వెల్ల‌డి

బిగ్ బాస్ తెలుగు సీజ‌న్-8 య‌మ రంజుగా కొన‌సాగుతోంది. మూడోవారంలోకి అడుగుపెట్టిన ఈ రియాల్టీ షో నుంచి ఆదివారం రెండో ఎలిమినేష‌న్ జ‌రిగింది. కంటెస్టెంట్ శేఖ‌ర్ బాషా ఎలిమినేట్ అయ్యారు. ఇక మొద‌టి వారం ఎలిమినేష‌న్‌లో భాగంగా బెజ‌వాడ బేబ‌క్క బిగ్ బాస్ హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. 

అయితే, శేఖ‌ర్ బాషా ఎలిమినేష‌న్ చాలా మందికి షాకిచ్చింది. ఎందుకంటే ప్ర‌స్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నవారిలో ఎంతోకొంత హాస్యం పండించేది ఒక్క బాషానే. అలాంటిది ఆయ‌నే బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌డంతో కొంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఓ ఆస‌క్తిక‌ర వార్త‌ బాగా వైర‌ల్ అవుతోంది. 

శ‌నివారం నాటి ఎడిసోడ్‌లో బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న శేఖ‌ర్ బాషాకు హోస్ట్ నాగార్జున తీపి క‌బురు చెప్పారు. బాషాకు మూడు రోజుల క్రితం బాబు పుట్టిన‌ట్టు నాగ్ తెలియ‌జేశారు. దాంతో ఆయ‌నే స్వ‌యంగా బిగ్ బాస్ ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. అందుకే బిగ్ బాస్ బాషాను ఎలిమినేట్ అయ్యేలా ప్లాన్ చేశార‌ని స‌మాచారం. 

ఈ వార్త‌ల‌పై తాజాగా శేఖ‌ర్ బాషా స్పందించారు. "బిగ్ బాస్ హౌస్ నుంచి న‌న్ను ఎవ‌రూ బ‌య‌ట‌కు పంప‌లేదు. నేనే వ‌చ్చేశాను. ఇది బిగ్ బాస్ చ‌రిత్ర‌లోనే తొలి హ్యాపీ ఎలిమినేష‌న్‌. నా కుమారుడిని చూడ‌టానికే బ‌య‌ట‌కు వ‌చ్చేశా. అలాగే బిగ్ బాస్ ఇంట్లో కొంచెం ఫుడ్ కూడా స‌మ‌స్య‌గా ఉంది. నాకు మ‌ద్ద‌తు తెలిపిన వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు. నేను త‌ప్ప‌కుండా టాప్‌-5లో ఉంటాన‌ని న‌మ్మి స‌పోర్ట్ చేసిన వారంద‌రినీ క్ష‌మాప‌ణ‌లు కోరుతున్నాను" అని శేఖ‌ర్ బాషా చెప్పుకొచ్చారు.

More Telugu News