Sri Simha: 'మత్తువదలరా 2' మూవీ మండే టాక్!

Mathu Vadalara 2 Movie Update

  • సింహా కోడూరి హీరోగా వచ్చిన 'మత్తు వదలరా 2' 
  • నాన్ స్టాప్ గా నవ్వించే కంటెంట్ 
  • సత్య పాత్ర ప్రత్యేకమైన ఆకర్షణ 
  • హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా


యంగ్ హీరోల రేసులో ఇప్పుడు శ్రీ సింహా కూడా కనిపిస్తున్నాడు. ఒక సినిమా తరువాత ఒకటిగా చేసుకుంటూనే తన మార్క్ వేయడానికి ట్రై చేస్తున్నాడు. గతంలో వచ్చిన 'మత్తువదలరా' సినిమాతో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. అదే సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు హిట్ కొట్టాడు. ఈ నెల 13వ తేదీన థియేటర్లకు వచ్చిన 'మత్తువదలరా 2' మంచి విజయాన్ని అందుకుంది. లాభాల దిశగా అడుగులు వేస్తోంది. 

'మత్తువదలరా'  సినిమాలోని డ్రగ్స్ అంశం సీక్వెల్ లోను కొనసాగుతుంది.  కొంతమంది నేరస్థులను పట్టుకోవడానికి 'హీ టీమ్'ను ఏర్పాటు చేయడం .. అందులో హీరో .. అతని స్నేహితుడు ఏజెంట్లుగా పనిచేయడం బాగుంది. కిడ్నాప్ కేసును ఛేదించడానికి రంగంలోకి దిగి మర్డర్ కేసులో ఇరుక్కోవడమనే డ్రామా కావలసినంత కామెడీని అందిస్తుంది. కథ చాలా తేలికగా అనిపించినప్పటికీ, సరదాగా నవ్వుకోవడానికి బాగుంటుంది. 

ఒకే ఒక్క పాత్ర ఒక్కోసారి సినిమాను నిలబెడుతూ ఉంటుంది. మిగతా పాత్రలన్నీ ఒక వైపు .. ఒకేఒక్క పాత్ర ఒకవైపు అనే అద్భుతం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి ఇలాంటి ఒక పాత్ర హీరో పాత్రను సైతం డామినట్ చేస్తూ ఉంటుంది. అలాంటి ఒక పాత్రనే ఈ సినిమాలో సత్య పోషించాడు. ఆ పాత్ర ఆడియన్స్ ను అలా కూర్చోబెడుతుంది. సరదాగా .. హాయిగా కాసేపు నవ్వుకోవాలనుకునేవారు ఈ సినిమాకి వెళ్లొచ్చు. లాజిక్కులను పక్కన పెట్టి లాఫింగ్ కి తెరతీయవచ్చు అనే మాటనే థియేటర్ల దగ్గర వినిపిస్తోంది. 

Sri Simha
Sathya
Faria Abdullah
Mathu Vadalara 2
  • Loading...

More Telugu News