Bhavana: ఓటీటీ తెరపైకి మలయాళ హారర్ థ్రిల్లర్!

Hunt Movie Update

  • భావన ప్రధాన పాత్రగా 'హంట్'
  • హారర్ థ్రిల్లర్ జోనర్లో సాగే కథ 
  • దర్శకత్వం వహించిన షాజీ కైలాస్
  • ఈ నెల 20 నుంచి జీ 5లో స్ట్రీమింగ్?




తెలుగులో కథానాయికగా కొన్ని సినిమాలు చేసిన భావనకి, మలయాళంలో మంచి క్రేజ్ ఉంది. కొంతకాలంగా ఆమె అక్కడ నాయిక ప్రధానమైన పాత్రలను చేస్తూ వెళుతోంది. అలా ఈ ఏడాదిలో ఆమె చేసిన థ్రిల్లర్ సినిమాలలో 'హంట్' ఒకటి. షాజీ కైలాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఆగస్టు 29వ తేదీన థియేటర్లకు వచ్చింది. థియేటర్ల నుంచి ఓ మాదిరి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. 

అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి రెడీ అవుతోంది. జీ 5 వారు ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 20వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టు సమాచారం.  మలయాళంతో పాటు తెలుగు .. తమిళ .. కన్నడ భాషల్లో ఈ సినిమాను అందుబాటులోకి తీసుకుని రానున్నట్టు చెబుతున్నారు. 

కీర్తి ఫోరెన్సిక్ డాక్టర్ గా పనిచేస్తూ ఉంటుంది. ఓ మహిళ హత్యకేసుకు సంబంధించిన ఆధారాలను వెలికితీసే పనిలో కీర్తి ఉంటుంది. అది ఆమె రెగ్యులర్ గా చేసే పనినే. అయితే ఈ కేసును మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆమెకి అనూహ్యమైన సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. ఒక ఆత్మ ఆమెను వెంటాడుతూ ఉంటుంది. అది గ్రహించిన కీర్తి ఏం చేస్తుంది? ఆమెను వెంటాడుతున్న ఆత్మ ఉద్దేశం ఏమిటి? అనేది కథ. చూడాలి మరి ఈ సినిమా ఓటీటీ వైపు నుంచి ఎన్ని మార్కులు తెచ్చుకుంటుందో. 

  • Loading...

More Telugu News