Indore Horror: 5 నెలల గర్భిణి అయిన స్నేహితురాలిపై ఆర్మీ జవాను అత్యాచారం.. వీడియోలు చూపిస్తూ బ్లాక్‌మెయిల్

Army Man Raped 5 Month Pregnant Friend In Madhya Pradesh
  • మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణం
  • అఘాయిత్యం కారణంగా రక్తస్రావం, కడుపులో నొప్పి
  • నిందితుడిని కటకటాల వెనక్కి పంపిన పోలీసులు
ఇండోర్‌లో దారుణం జరిగింది. 5 నెలల గర్భిణి అయిన స్నేహితురాలిపై అత్యాచారానికి పాల్పడిన ఆర్మీ జవానును మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. పోలీసుల కథనం ప్రకారం.. 35 ఏళ్ల బాధితురాలు బ్యాంకు అధికారి భార్య. ఏడాది క్రితం ఆమె ఎంహౌ కంటోన్మెంట్‌లో వస్తువులు కొనడానికి వెళ్లినప్పుడు ఆర్మీలో లాన్స్ నాయక్‌గా పనిచేస్తున్న జవానుతో పరిచయం ఏర్పడింది. 

ఆ తర్వాత అతడు తరచూ ఆమె ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో ఆమె వాష్ రూములో ఉన్న సమయంలో వీడియోలు తీశాడు. అనంతరం వాటిని చూపించి ఆమెను బ్లాక్‌మెయిల్ చేసేవాడు. శుక్రవారం రాత్రి మరోమారు ఆమెను బెదిరించి ఇండోర్‌లోని ఓ హోటల్ రూముకు పిలిపించుకున్నాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె గర్భిణి కావడంతో రక్తస్రావం కావడంతోపాటు విపరీతమైన నొప్పితో విలవిల్లాడిపోయింది.

తర్వాతి రోజు ఉదయం ఆమె మహిళా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిందితుడిపై ఫిర్యాదు చేసింది. ఏడాది కాలంగా అతడు తనను లైంగికంగా వేధిస్తున్నట్టు ఆరోపించింది. అయితే, నిందితుడి వాదన మరోలా ఉంది. తామిద్దరం ఏడాదికాలంగా డేటింగ్‌లో ఉన్నట్టు చెప్పాడు. ఆమె గర్భిణి అయినప్పటికీ శారీరకంగా కలవడంతోనే రక్తస్రావమైందని చెప్పుకొచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Indore Horror
Madhya Pradesh
Army Man
Crime News

More Telugu News