Jr NTR: దేవరలో ఆ పాత్రకు ఆయన మాత్రమే న్యాయం చేయగలరనిపించింది: ఎన్టీఆర్

ntr comments on saif ali khan

  • సెప్టెంబర్ 27న విడుదల కానున్న దేవర మూవీ
  • దేవర చిత్ర బృందాన్ని ఇంటర్వ్యూ చేసిన సందీప్ రెడ్డి వంగా 
  • భైర పాత్ర ఎంతో కీలకమని వ్యాఖ్యానించిన ఎన్టీఆర్ 
  • సైఫ్ అలీఖాన్ మాత్రమే భైర పాత్రకు న్యాయం చేయగలరని అనిపిందన్న ఎన్టీఆర్

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన మూవీ దేవర ఈ నెల (సెప్టెంబర్) 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందాన్ని ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. దేవరలో భైర పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. ఆ పాత్రకు సైఫ్ అలీఖాన్ మాత్రమే న్యాయం చేయగలరని అనిపించిందన్నారు. ఓంకారలో ఆయన యాక్టింగ్ అద్భుతమని అన్నారు. సైఫ్ టాలెంట్ ను ఇప్పటి వరకూ ఎవరూ సరిగ్గా ఉపయోగించుకోలేదని ఎన్టీఆర్ అభిప్రాయపడ్డారు. 

  • Loading...

More Telugu News