MBBS: ఏపీలో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల విడుదల

AP MBBS Convener quota seats released

  • ఏపీలో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలు
  • రాష్ట్రంలో 35 మెడికల్ కళాశాలలు
  • 2024-25 విద్యాసంవత్సరానికి వర్తించేలా సీట్ల కేటాయింపు

ఏపీలో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లను విడుదల చేస్తూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నేడు (సెప్టెంబరు 15) ఓ ప్రకటన చేసింది. ఏపీలో 35 మెడికల్ కాలేజీలు ఉండగా... 2024-25 విద్యా సంవత్సరానికి వర్తించేలా కన్వీనర్ కోటా సీట్ల కేటాయింపు వివరాలను ప్రకటించారు.

  • అన్ని మెడికల్ కాలేజీల్లో మొత్తం ఎంబీబీఎస్ సీట్లు- 3,879
  • ప్రత్యేక కేటగిరీ సీట్లు- 267 (స్పోర్ట్స్, ఎన్ సీసీ, పీహెచ్ సీ, క్యాప్)
  • మొదటి విడత కౌన్సిలింగ్ లో అందుబాటులో ఉండే సీట్లు- 3,612
  • వీటిలో కాలేజీల వారీగా భర్తీ అయిన సీట్లు- 3,507
  • మిగిలిన సీట్లు- 105
  • వీటిలో మైనారిటీ వర్గాలకు కేటాయించిన సీట్లు- 102
  • స్కౌట్స్ అండ్ గైడ్స్ కు కేటాయించిన సీట్లు- 3

కీలక తేదీలు...

  • ఫస్ట్ ఫేజ్ లో సీట్లు పొందిన 3,507 మంది విద్యార్థులు కాలేజీలో అడ్మిషన్లు తీసుకోవాల్సిన తేదీ- సెప్టెంబరు 19 (మధ్యాహ్నం 3 గంటల లోపు)
  • ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం తరగతులు- అక్టోబరు 1న ప్రారంభం


  • Loading...

More Telugu News