Harish Rao: రేవంత్ రెడ్డి ఎంత గగ్గోలు పెట్టినా నా అంత ఎత్తుకు ఎదగలేరు: హరీశ్ రావు

Harish Rao satires on Revanth Reddy

  • రేవంత్ మాట్లాడేవన్నీ అబద్ధాలేనన్న హరీశ్ రావు
  • నేను ఎక్కడా దాక్కోలేదు... నీ గుండెల్లోనే ఉన్నా అంటూ ఘాటు వ్యాఖ్యలు
  • రుణమాఫీపై చర్చకు సిద్ధమా? అని సవాల్

బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి మాట్లాడేవన్నీ అబద్ధాలేనని అన్నారు. రేవంత్ రెడ్డి ఎంత గగ్గోలు పెట్టినా నా అంత ఎత్తుకు ఎదగలేరని వ్యంగ్యం ప్రదర్శించారు. నేను తాటి చెట్టంత ఎదిగాను సరే... నువ్వు కనీసం వెంపలి చెట్టంత ఎత్తయినా లేవు కదా అని ఎద్దేవా చేశారు. నా గురించి రేవంత్ కు ఎందుకంత బాధ? ముందు ప్రజల ఇబ్బందులు తొలగించడంపై దృష్టి పెట్టాలి అని వ్యాఖ్యానించారు. 

ఎక్కడ దాక్కున్నావంటూ రేవంత్ మాట్లాడుతున్నారు... నేను ఎక్కడా దాక్కోలేదు, నీ గుండెల్లోనే ఉన్నా... రుణమాఫీపై నిన్ను అడుగడుగునా నిలదీస్తుంటా అని హరీశ్ రావు ఘాటుగా వ్యాఖ్యానించారు. మీ మెడలు వంచి సగం రుణమాఫీ చేయించాం... మొత్తం రుణమాఫీ పూర్తయ్యే వరకు మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు అని స్పష్టం చేశారు.  

సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లిలో రుణమాఫీ జరిగిందా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. 100 రోజుల్లో రుణమాఫీ అమలు చేస్తామన్నారు... రుణమాఫీపై చర్చకు సిద్ధమా? అని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. అన్ని పంటలకు బోనస్ అని చెప్పి, అంతా బోగస్ చేశారు, అన్ని విధాలుగా రైతులను మోసం చేశారు అని విమర్శించారు.

Harish Rao
Revanth Reddy
Loan Waiver
BRS
Congress
Telangana
  • Loading...

More Telugu News