Divi's Laboratories: ఏపీ మంత్రి నారా లోకేశ్ కు రూ.5 కోట్ల విరాళం చెక్కు అందించిన డాక్టర్ కిరణ్

Divis Laboratories CEO Dr Kiran handed Rs 5 crore cheque to AP minister Nara Lokesh

  • ఏపీలో వరద బీభత్సం
  • పెద్ద మనసుతో స్పందించిన దివీస్ ల్యాబొరేటరీస్
  • తక్షణ సాయంగా రూ.4.8 కోట్ల నగదు బదిలీ
  • ఇవాళ రూ.5 కోట్ల చెక్కు అందజేత
  • మొత్తం రూ.9.8 కోట్లు అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపిన లోకేశ్

ఏపీలో వరద బీభత్సం పట్ల దివీస్ ల్యాబొరేటరీస్ యాజమాన్యం ఉదారంగా స్పందించింది. వరద బాధితుల సహాయార్థం మొత్తం రూ.9.8 కోట్లు విరాళంగా ప్రకటించింది. ఇప్పటికే రూ.4.8 కోట్ల నగదును తక్షణ సాయం కోసం బదిలీ చేసిన దివీస్ ల్యాబొరేటరీస్ యాజమాన్యం... నేడు మరో రూ.5 కోట్లను అందించింది. 

ఇవాళ ఏపీ మంత్రి నారా లోకేశ్ ను కలిసిన దివీస్ ల్యాబొరేటరీస్ సీఈవో డాక్టర్ కిరణ్ రూ.5 కోట్ల చెక్కును అందించారు. దీనిపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు నాయకత్వంలోని రాష్ట్ర ప్రజలు ఐక్యంగా ముందుకు వస్తున్నారని కొనియాడారు. 

ఎంతో పెద్ద మనసుతో రాష్ట్రంలోని వరద బాధితుల సహాయార్థం రూ.9.8 కోట్ల విరాళం ప్రకటించిన దివీస్ ల్యాబొరేటరీస్ అధినేత డాక్టర్ మురళీ దివికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. 

దివీస్ సంస్థ సమయోచిత సాయం, అక్షయ పాత్ర సహకారంతో వరద బాధితులకు ఎంతో ఉపశమనం కలుగుతుందని, ఈ కష్టకాలంలో వరద బాధితులకు ఈ  విరాళాలు తగిన ఆసరా అందిస్తాయని లోకేశ్ వివరించారు.

  • Loading...

More Telugu News