Vande Bharat Train: ఒకేసారి ఆరు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Modi flags off six Vande Bharat trains

  • ఝార్ఖండ్ లో పర్యటించిన ప్రధాని మోదీ
  • టాటానగర్-పాట్నా వందేభారత్ రైలుకు టాటా నగర్ లో ప్రారంభోత్సవం
  • అదే సమయంలో మిగతా ఐదు రైళ్లకు వర్చువల్ గా ప్రారంభోత్సవం

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఒకేసారి 6 వందేభారత్ రైళ్లను ప్రారంభించారు. మోదీ నేడు ఝార్ఖండ్ లోని టాటా నగర్ జంక్షన్ రైల్వే స్టేషన్ టాటానగర్-పాట్నా వందేభారత్ రైలును ప్రారంభించారు. అదే సమయంలో మరో ఐదు రైళ్లను కూడా వర్చువల్ విధానంలో ప్రారంభించారు. 

మిగతా ఐదు రైళ్లు... భాగల్ పూర్-దుమ్కా-హౌరా... బ్రహ్మపూర్-టాటానగర్... గయ-హౌరా... దేవగఢ్-వారణాసి... రూర్కేలా-హౌరా మార్గాల్లో నడుస్తాయి. 

తన పర్యటన సందర్భంగా మోదీ టాటా నగర్ రైల్వే స్టేషన్ వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దాదాపు రూ.660 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. 

మోదీ టాటా నగర్ లో భారీ రోడ్ షోలో పాల్గొనాల్సి ఉన్నప్పటికీ, భారీ వర్షం కారణంగా ఆ రోడ్ షో రద్దయింది.

  • Loading...

More Telugu News