Big boss: శేఖర్ బాషాకు గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్

Big Boss Good news to Sekhar Basha

  • మగ బిడ్డకు జన్మనిచ్చిన శేఖర్ బాషా భార్య
  • విషయం తెలిసి సంతోషంతో కన్నీళ్లు పెట్టిన యాంకర్
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన బిగ్ బాస్ ప్రోమో

బిగ్ బాస్ సీజన్ 8లో రెండో వారంలో ఎలిమినేషన్ అంచున ఉన్న శేఖర్ బాషాకు బిగ్ బాస్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆయన భార్య మగ బిడ్డకు జన్మనిచ్చిందని హోస్ట్ నాగార్జున చెప్పడంతో శేఖర్ బాషా ఎమోషన్ కు గురయ్యాడు. సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. 

రేడీయో జాకీ, టీవీ యాంకర్ గా జనాల్లో మంచి గుర్తింపు పొందిన శేఖర్ బాషా బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తనదైన స్టైల్ లో పంచులు విసురుతూ అటు హౌస్ మేట్లను ఇటు ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

అయితే, రెండోవారం ఎలిమినేషన్ లిస్టులో శేఖర్ బాషా కూడా ఉన్నాడు. మిగతా వారితో పోలిస్తే బయటకు వెళ్లే అవకాశం ఆయనకే ఉందని ప్రచారం జరుగుతోంది. 

ఈ వారం నామినేషన్ లో శేఖర్ బాషాతో పాటు నాగమణికంఠ, నైనిక, విష్ణుప్రియ, నిఖిల్, ఆదిత్య, పృథ్వీ శెట్టి ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Big boss
sekar basha
Nagarjuna
Elimination
  • Loading...

More Telugu News