bada ganesh: ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి నేడే చివరి రోజు.. బారులు తీరిన భక్తులు

Khairatabad bada ganesh last day

  • ఎల్లుండి శోభాయాత్ర, నిమజ్జనం
  • నిమజ్జనానికి మొదలైన ఏర్పాట్లు
  • సాయంత్రం రుద్రాక్షల పంపిణీ

ఖైరతాబాద్ బడా గణేశుడి దర్శనానికి నేడు చివరి రోజు.. ఎల్లుండి శోభాయాత్ర, నిమజ్జనం జరపనుండడంతో ఇవాల్టితో దర్శనాలు నిలిపివేయనున్నారు. నేటి అర్ధరాత్రి తర్వాత లంబోదరుడి దర్శనానికి అనుమతి ఉండదని అధికారులు, నిర్వాహకులు వెల్లడించారు. శోభాయాత్ర కోసం భారీ వాహనం ఇప్పటికే వచ్చిందని, వెల్డింగ్ పనులు చేపట్టామని వివరించారు. కాగా, చివరి రోజు ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఫ్యామిలీతోసహా వచ్చి బడా గణేశుడి దర్శనానికి బారులు తీరారు.

భక్తులు పోటెత్తడంతో ఖైరతాబాద్ లో రద్దీ నెలకొంది. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్, టెలిఫోన్ భవన్ వైపు రద్దీ ఎక్కువగా ఉంది. దర్శనానికి చివరిరోజు కావడంతో భక్తుల రద్దీకి అనుగుణంగా సెక్యూరిటీ ఏర్పాట్లు చేశామని, ఎక్కడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ రోజు సాయంత్రం బడా గణపతి మెడలో వేసిన లక్ష రుద్రాక్షలను పంచి పెట్టనున్నారు. సెప్టెంబర్ 17న మహాశోభాయాత్ర తర్వాత.. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం జరగనుంది.

bada ganesh
khairatabad
shobayatra
last day

More Telugu News