Peddireddi Ramachandra Reddy: ఓ టీవీ చానల్ కు రూ.50 కోట్లకు పరువునష్టం నోటీసులు పంపిన పెద్దిరెడ్డి

Peddireddy issues defamation notice to Big TV

  • కొన్ని మీడియా చానళ్లపై పెద్దిరెడ్డి ఫైర్
  • అసత్య ప్రచారం చేస్తున్నాయంటూ ఆగ్రహం
  • ఇప్పటికే ఈటీవీ, మహాన్యూస్ చానళ్లకు నోటీసులు
  • తాజాగా బిగ్ టీవీకి నోటీసులు

బిగ్ టీవీ తెలుగు న్యూస్ చానల్ తనపై అసత్య ప్రచారం చేస్తోందంటూ మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ చానల్ కు రూ.50 కోట్లకు పరువునష్టం నోటీసులు పంపారు. ఈ విషయాన్ని పెద్దిరెడ్డి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 

తనపై విష ప్రచారం చేసిన మరో మీడియా సంస్థకు నోటీసులు పంపినట్టు తెలిపారు. తన న్యాయవాదుల ద్వారా నోటీసులు పంపినట్టు వివరించారు. తనపై నిరాధార వార్తలు ప్రసారం చేసి, వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వారిపై న్యాయపరంగా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్టు పెద్దిరెడ్డి వెల్లడించారు. 

పెద్దిరెడ్డి ఇప్పటికే ఈటీవీ, మహాన్యూస్ మీడియా సంస్థలకు రూ.100 కోట్లకు పరువునష్టం నోటీసులు పంపారు.

More Telugu News