Attack On TDP Office: టీడీపీ కార్యాలయంపై దాడి కేసు... విచారణకు హాజరైన వైసీపీ ఎమ్మెల్సీలు

YCP leaders attend enquiry in Mangalagiri Rural Police Station

  • గత ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యాలయంపై దాడి 
  • ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలు
  • నోటీసులు పంపిన మంగళగిరి పోలీసులు
  • విచారణకు హాజరైన తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్

గత ప్రభుత్వం హయాంలో మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలు నేడు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. 

వైసీపీ ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, వైసీపీ నేత దేవినేని అవినాశ్ నేడు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. వారి వెంట న్యాయవాది గవాస్కర్ కూడా ఉన్నారు. గత మూడు గంటలుగా విచారణ కొనసాగుతోంది. 

పోలీసులు అన్ని కోణాల్లో వారిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, పోలీసులు ఏం అడిగినా, వైసీపీ నేతల నుంచి తెలియదంటూ సమాధానాలు వస్తున్నట్టు సమాచారం.

ఓవైపు మంగళగిరి రూరల్ పీఎస్ లో విచారణ జరుగుతుండగా... స్టేషన్ బయట వైసీపీ నేతల అనుచరులు వేచిచూస్తున్నారు.

More Telugu News