CV Anand: గణేశ్ నిమజ్జనం సందర్భంగా 25 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు: సీపీ సీవీ ఆనంద్

CV Aanand on Ganesh immersion

  • అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 25 వేలమందితో బందోబస్తు
  • 16, 17 తేదీల్లో నిమజ్జనం ఉండటంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి
  • ప్రజలు, అధికారులు సహకరించాలన్న సీవీ ఆనంద్

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 25 వేలమందితో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామన్నారు. 

ప్రతి ఏడాది నిమజ్జనం సందర్భంగా పోలీసులు పటిష్ఠమైన బందోబస్తును ఏర్పాటు చేస్తారు. ఈ ఏడాది కూడా ఘర్షణలు జరగకుండా, ప్రాణనష్టం జరగకుండా, సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీ తెలిపారు.

హైదరాబాద్‌కు చెందిన 15 వేల సిబ్బందితో పాటు బయటి నుంచి మరో 10 వేల మందిని రంగంలోకి దింపుతున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 16, 17 తేదీల్లో పెద్ద ఎత్తున విగ్రహాల నిమజ్జనం ఉందని, దీంతో ఈ రెండు రోజులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 25 వేలమంది పోలీసులు దాదాపు 40 గంటల పాటు పహారా కాస్తారన్నారు. ప్రజలు, అధికారులు కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.

More Telugu News