BJP: బీఆర్ఎస్ విధానాలనే కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తోంది: బీజేపీ ఎమ్మెల్యే

BJP MLA lashes out at congress government

  • ఆదిలాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలులో అక్రమాలు జరిగాయన్న ఎమ్మెల్యే
  • తెలంగాణ పౌరసరఫరాల శాఖ రూ.54 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని వ్యాఖ్య
  • అవకతవకలపై గవర్నర్‌కు వినతిపత్రం ఇస్తామన్న పాయల్ శంకర్

ధాన్యం కొనుగోలులో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం... గత ప్రభుత్వం విధానాలనే అనుసరిస్తోందని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఆదిలాబాద్ జిల్లా పౌరసరఫరాల శాఖలో ధాన్యం కొనుగోలులో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పౌరసరఫరాల శాఖ రూ.54 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందన్నారు.

ధాన్యం కొనుగోలులో జరిగిన అవకతవకలపై గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇస్తామన్నారు. ఈ అవకతవకలపై విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలులో ఐదుగురు వేలందారులు టెండర్లు దక్కించుకున్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రూ.2,230 కోట్ల కుంభకోణం జరిగిందన్న అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News