Ram Charan: ఐఐఎఫ్ఏ ఉత్సవం-2024 కార్యక్రమానికి హాజరుకానున్న రామ్ చరణ్

Ram Charan will attend IIFA Utsavam 2024

  • అబుదాబిలో ఈ ఏడాది ఐఐఎఫ్ఏ ఉత్సవం
  • యాస్ ఐలాండ్ లోని ఎతిహాద్ ఎరీనా వేదికగా అవార్డుల పండుగ
  • రామ్ చరణ్ హాజరవుతున్నట్టు ప్రకటన చేసిన నిర్వాహకులు

దక్షిణాది సినీ అవార్డుల పండుగ ఐఐఎఫ్ఏ ఉత్సవం-2024 కార్యక్రమానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హాజరుకానున్నారు. అబుదాబిలోని యాస్ ఐలాండ్ లో సెప్టెంబరు 27న ఐఐఎఫ్ఏ (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్) వేడుక జరగనుంది. ఇక్కడి ఎతిహాద్ ఎరీనా వేదికగా జరిగే ఈ అవార్డుల ఉత్సవంలో రామ్ చరణ్ సందడి చేయనున్నారు. ఈ మేరకు ఐఐఎఫ్ఏ నిర్వాహకులు ఓ ప్రకటనలో వెల్లడించారు. 

కాగా, రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ ఓరియెంటెడ్ చిత్రంలో నటించనున్నారు.

More Telugu News