Attack On TDP Office: వైసీపీ ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు

Mangalagiri police issues notice to Talasila Raghuram and Lella Appireddy

  • టీడీపీ కార్యాలయంపై దాడి కేసు
  • తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డికి మంగళగిరి పోలీసుల నోటీసులు
  • ఈ మధ్యాహ్నం విచారణకు రావాలంటూ స్పష్టీకరణ

వైసీపీ ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డికి మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు రావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. 

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వైసీపీ నేతలు అరెస్ట్ భయంతో సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు.

ఈ నేపథ్యంలో, 41ఏ సెక్షన్ కింద నోటీసులు ఇచ్చిన పోలీసులు... ఈ మధ్యాహ్నం విచారణకు రావాలని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో, వైసీపీ నేతలు తమ పాస్ పోర్టులను మంగళగిరి రూరల్ పీఎస్ లో అందజేయనున్నారు.

More Telugu News