Pushpa 2: The Rule: పుష్ప-2కు అక్టోబరే డెడ్‌లైన్‌!

october dead line for pushpa2

  • అక్టోబర్‌లో చిత్రీకరణ పూర్తి చేయాలని లక్ష్యం 
  • ఆర్‌ఎఫ్‌సీలో కీలక సన్నివేశాల చిత్రీకరణ 
  • చిత్రీకరణతో పాటు కొనసాగుతున్న పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు

'పుష్ప' చిత్రంతో పాన్‌ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు హీరో అల్లు అర్జున్‌. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల మెప్పు పొందిన సంగతి తెలిసిందే. 

తాజాగా అ్లలు అర్జున్‌-సుకుమార్‌ కలయికలో ఈ చిత్రానికి సీక్వెల్‌గా పుష్ప-2 ది రూల్‌ వస్తోంది. మొదటగా ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేయాడానికి ప్లాన్‌ చేశారు. అయితే చిత్రీకరణతో పాటు నిర్మాణానంతర పనులు బ్యాలెన్స్‌ ఉండటంతో మేకర్స్‌ డిసెంబరు 6కు వాయిదా వేశారు. 

ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదల చేసిన రెండు పాటలు, టీజర్‌కు వచ్చిన అనూహ్య స్పందన చిత్రంపై మరింత అంచనాలు పెంచేశాయి. అయితే డిసెంబరు 6న విడుదల లక్ష్యంగా ఈ చిత్రం షూటింగ్‌తో పాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సీలో జరుగుతోంది.  చిత్రంలోని ముఖ్యతారలంతా పాల్గొంటున్న కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇవి ఈ చిత్రంలో మేజర్‌ హైలైట్‌గా ఉంటాయని యూనిట్‌ సభ్యులు అంటున్నారు. 

కాగా, ఈ చిత్రం షూటింగ్‌ను వచ్చే నెల 15లోగా పూర్తిచేయాలని దర్శక, నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. దాదాపుగా అక్టోబర్‌ 15 నాటికి చిత్రీకరణ పూర్తవుతుందనే విశ్వాసంతో ఉన్నారు. ఇక అక్టోబరు మూడో వారం నుంచి ప్రమోషన్స్‌ను ప్లాన్‌ చేస్తున్నారని తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్‌ అండ్‌ సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Pushpa 2: The Rule
pushpa 2 latest news
Allu Arjun
Rashmika Mandanna
Sukumar
Tollywood
  • Loading...

More Telugu News