Ganta Srinivasa Rao: విజయసాయిరెడ్డి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు: గంటా శ్రీనివాస్

Vijayasai Reddy doing cheap politics says Ganta Srinivas
  • వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం భరత్, పల్లా రాజీనామా చేయాలన్న విజయసాయి
  • గతంలో విజయసాయి ఎందుకు రాజీనామా చేయలేదన్న గంటా
  • స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు దృష్టి సారించారని వ్యాఖ్య
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో గతంలో గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసిన విధంగానే... ఇప్పుడు విశాఖ టీడీపీ ఎంపీ భరత్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ రాజీనామా చేయాలంటూ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ పై గంటా మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా భరత్, పల్లా శాయశక్తులా కృషి చేస్తున్నారని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పల్లా శ్రీనివాసరావు ఆమరణదీక్షను కూడా చేపట్టారని గుర్తు చేశారు. 

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తాను గతంలో స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేశానని... తన రాజీనామాను స్పీకర్ ఆమోదించడం కూడా జరిగిందని గంటా చెప్పారు. కానీ అప్పుడు విజయసాయిరెడ్డి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్టీల్ ప్లాంట్ పై సీఎం చంద్రబాబు దృష్టి సారించారని చెప్పారు. స్టీల్ ప్లాంట్ కు కేంద్ర మంత్రి కుమారస్వామిని రప్పించారని... స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాదని కుమారస్వామి చెప్పారని తెలిపారు 

విజయసాయిరెడ్డి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. ఆయన రాజకీయాలు చేయాలనుకుంటే వేరేలా చేసుకోవడం మంచిదని సూచించారు. స్టీల్ ప్లాంట్ పై చిత్తశుద్ధి ఉంటే ఆనాడే రాజీనామా చేసి ఉంటే బాగుండేదని చెప్పారు.
Ganta Srinivasa Rao
Chandrababu
Telugudesam
Vijayasai Reddy
YSRCP

More Telugu News