KTR: చంద్రబాబు, వైఎస్‌తోనే కొట్లాడాం... రేవంత్ రెడ్డి ఓ చిట్టినాయుడు: కేటీఆర్ ఎద్దేవా

KTR says Revanth Reddy is bachha for brs

  • చరిత్రలో రేవంత్ రెడ్డిలాంటి సీఎంలను చాలామందిని చూశామన్న కేటీఆర్
  • కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్యలతో పోలిస్తే రేవంత్ చాలా చిన్నోడని విమర్శ
  • హైదరాబాద్ భాషలో రేవంత్ రెడ్డి ఓ బుల్లెబ్బాయ్ అని చురక

తాము చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డి వంటి వారితోనే కొట్లాడామని, కానీ వారికింద రేవంత్ రెడ్డి ఓ చిట్టినాయుడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్... ఆయనను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.

"చరిత్రలో నీలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రులు... నీలాంటి తలమాసిన ముఖ్యమంత్రులు మస్తుగ (ఎంతోమంది) వచ్చారు... మస్తుగ పోయారు. పెద్దపెద్దవాళ్లతో కొట్లాడాం. చంద్రబాబుతో కొట్లాడాం... రాజశేఖర రెడ్డితో కొట్లాడాం... కిరణ్ కుమార్ రెడ్డితో, రోశయ్యతోనూ కొట్లాడాం... ఇలా ఎంతోమందితో తలపడ్డాం. వాళ్లందరికంటే కూడా నువ్వు (రేవంత్ రెడ్డి) చాలా చిన్నోడివి. నువ్వు చిట్టినాయుడివి. చాలా చిన్నవాడివి.

మా భాషలో... హైదరాబాద్ భాషలో చెప్పాలంటే నీలాంటి వాడిని బుల్లబ్బాయ్ అంటాం... నీలాంటి బుల్లెబ్బాయిలను... చిట్టినాయుడులను చాలా మందిని చూశాం. ఏం ఫరక్ పడేది లేదు. వెంట్రుక కూడా పీకలేవు కానీ, నాలుగు రోజులు ఏదో పైశాచిక ఆనందం. ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాను... నేనేదో పెద్దవాడిని అయ్యానని ఎగిరెగిరి పడుతున్నావ్.. కానీ రేవంత్ రెడ్డి అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. నీ దుష్టసంప్రదాయం నువ్వు పదవిలో నుంచి దిగిపోయాక నిన్ను వెంటాడుతుందని హెచ్చరిస్తున్నాను" అని మండిపడ్డారు.

కౌశిక్ రెడ్డిని ఆలింగనం చేసుకున్న కేటీఆర్

కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్ ఆయనను ఆలింగనం చేసుకొని... ఆప్యాయంగా పలకరించారు. టైగర్ కౌశిక్ భాయ్ అంటూ సంబోధించారు. అనంతరం బైపాస్ సర్జరీ చేయించుకున్న కౌశిక్ రెడ్డి మామ కృష్ణారెడ్డిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

More Telugu News