Ponnam Prabhakar: హైదరాబాద్‌లో అలజడులు సృష్టించాలని ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరించాలి: పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar warns brs leaders

  • హైదరాబాద్ ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోందని వ్యాఖ్య
  • ఇలాంటి చోట్ల ఇబ్బందులు సృష్టిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక
  • అపోహలు సృష్టించే వారిని ఉక్కుపాదంతో అణచివేయాలని పొన్నం ప్రభాకర్

ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో ఎవరైనా అలజడులు సృష్టించాలని ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ... ఐక్యతకు హైదరాబాద్ ప్రతీకగా నిలుస్తోందన్నారు. ఇలాంటి చోట ఎవరైనా ఇబ్బందులు సృష్టిస్తే ఊరుకునేది లేదన్నారు.

సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే, అపోహలు సృష్టించే వారిని ఉక్కుపాదంతో అణచివేయాలన్నారు. ఈ నెల 17న గణేశ్ నిమజ్జన వేడుకలు రాజకీయాలకు అతీతంగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రభుత్వం పటిష్ఠమైన ఏర్పాట్లు చేసిందని తెలిపారు.

More Telugu News