Kedarnath: కేదార్‌నాథ్‌లో చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులు క్షేమం

Telugu pilgrims stranded in Kedarnath are safe

  • వాతావరణం అనుకూలించక చిక్కుకుపోయిన యాత్రికులు
  • ఆపదలో ఉన్నట్లు విజయనగరం ఎంపీకి తెలిపిన యాత్రికులు
  • కేంద్ర, ఉత్తరాఖండ్ అధికారులతో మాట్లాడిన మంత్రి లోకేశ్

కేదార్‌నాథ్ యాత్రలో చిక్కుకున్న తెలుగు యాత్రికులు క్షేమంగా ఉన్నారు. అధికారులు వారిని ఈరోజు ఉదయం సురక్షిత ప్రాంతానికి తరలించారు. కొంతమంది యాత్రికులు కేదార్‌నాథ్‌ కు వెళ్లి అక్కడే చిక్కుకుపోయారు. తాము ఆపదలో ఉన్నామని, కిందకు చేరుకోలేకపోతున్నామంటూ ఆ భక్తులు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడిని సంప్రదించారు.

ఆయన వెంటనే ఈ విషయాన్ని మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి లోకేశ్ ఉత్తరాఖండ్, కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఈ అంశంపై చర్చించారు. అక్కడి అధికారులతో మాట్లాడి యాత్రికులు సురక్షితంగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే కొంతమంది యాత్రికులు గుప్తకాశీకి చేరుకున్నారు. ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాతావరణం సహకరించకపోవడంతో 20 మంది యాత్రికులు అక్కడ చిక్కుకుపోయారు.

More Telugu News