Srisailam temple: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం మల్లన్నకు చోటు

srisailam temple gets into world book of records

  • శ్రీశైలం మల్లన్న ఆలయానికి అరుదైన పురస్కారం
  • ఆలయ విస్తీర్ణం, ఆలయంలోని నంది విగ్రహానికి ఇంగ్లాండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు
  • ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్న ఆలయ ఈవో పెద్దిరాజు

జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. శ్రీశైలం ఆలయ విస్తీర్ణం, అలాగే ఆలయంలోని నంది విగ్రహనికి ఉన్న చరిత్ర, పురాతన పరంగా, ఆధ్యాత్మికంగా, పౌరాణిక ప్రాముఖ్యత కల్గి ఉన్నందున ఇంగ్లాండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఈ ఆలయానికి చోటు లభించింది. 

ఈ ఆలయానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు ధ్రువీకరణ పత్రం అందింది. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, ఆలయ ఇవో పెద్ది రాజుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జాయింట్ సెక్రటరీ అల్లాజీ ఎలియజర్ పత్రాన్ని అందజేశారు. గతంలోనూ ఈ దేవస్థానం ఏడు విభాగాలకు ఐఎస్ఓ ద్వారా ధ్రువీకరణ పత్రం అందుకుంది. ఇక, కొలిచిన వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీశైలం మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవారి ఆలయం నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంటుంది. శివరాత్రి, ఉగాది ఉత్సవాల సమయంలో రికార్డు స్థాయిలో భక్తులు తరలి వస్తుంటారు.

More Telugu News