YSRCP Corporators: టీడీపీ ఖాతాలోకి ఏలూరు కౌన్సిల్‌

All YSRCP Corporators Joins TDP in Eluru

  • తాజాగా టీడీపీలో చేరిన వైసీపీకి చెందిన మ‌రో ఐదుగురు కార్పొరేట‌ర్లు
  • టీడీపీలోకి దాపు అనూష‌, క‌ల‌వ‌కొల్లు సాంబ‌, ప్ర‌వీణ్ కుమార్, జ‌న‌ప‌రెడ్డి, అర్జి స‌త్య‌వ‌తి
  • కార్పొరేట‌ర్ల‌కు టీడీపీ కండువా క‌ప్పి స్వాగ‌తించిన ఎమ్మెల్యే బ‌డేటి చంటి
  • ఇప్ప‌టికే న‌గ‌ర మేయ‌ర్ నూర్జ‌హాన్‌ దంప‌తులు స‌హా 27 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి
  • దీంతో ఏలూరు కౌన్సిల్‌లో వైసీపీ ఖాళీ

వైసీపీకి చెందిన మ‌రో ఐదుగురు కార్పొరేట‌ర్లు తాజాగా టీడీపీలో చేరారు. దాంతో ఏలూరు న‌గ‌ర‌పాల‌క సంస్థ టీడీపీ ఖాతాలోకి చేరింది. ఏలూరు ప‌వ‌ర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యంలో శుక్ర‌వారం నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో స్థానిక ఎమ్మెల్యే బ‌డేటి చంటి స‌మ‌క్షంలో వైసీపీ కార్పొరేట‌ర్లు దాపు అనూష‌, క‌ల‌వ‌కొల్లు సాంబ‌, ప్ర‌వీణ్ కుమార్, జ‌న‌ప‌రెడ్డి, అర్జి స‌త్య‌వ‌తి టీడీపీ కండువా క‌ప్పుకున్నారు. 

ఇక ఇప్ప‌టికే న‌గ‌ర మేయ‌ర్ నూర్జ‌హాన్‌, పెద‌బాబు దంప‌తులతో పాటు 27 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు మ‌రో ఐదుగురు టీడీపీలో చేర‌డంతో కౌన్సిల్‌లో వైసీపీ ఖాళీ అయింది. 

ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ.. త్వ‌ర‌లో టీడీపీలోకి మ‌రిన్ని చేరిక‌లు ఉంటాయ‌న్నారు. సీఎం చంద్ర‌బాబు స్ఫూర్తితో ఏలూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఆద‌ర్శ‌వంత‌మైన పాల‌న అందిస్తున్నామ‌ని తెలిపారు. రాజ‌కీయాల్లో విలువ‌లు, గౌర‌వం చాలా కీల‌క పాత్ర పోషిస్తాయ‌ని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 

అలాగే సంక్షేమం, అభివృద్ధితో కొన‌సాగుతున్న కూట‌మి ప్ర‌భుత్వ ప్రజారంజ‌క పాల‌న‌లో భాగ‌స్వాముల‌య్యేందుకు ముందుకు వ‌చ్చిన వారికి స‌ముచిత స్థానం ఉంటుంద‌ని న‌గ‌ర మేయ‌ర్ నూర్జ‌హాన్ అన్నారు.

More Telugu News