Vijayawada Floods: సీఎం చంద్రబాబుకు రూ.4 కోట్ల భారీ విరాళం అందించిన భాష్యం విద్యాసంస్థల చైర్మన్

Bhashyam Institutions Chairman Ramakrishna donates Rs 4 crore to flood victims

  • ఏపీలో విలయం సృష్టించిన వరదలు
  • విలవిల్లాడిన విజయవాడ
  • పెద్ద మనసుతో విరాళాలు ప్రకటిస్తున్న దాతలు
  • చంద్రబాబుకు చెక్కు అందించిన 'భాష్యం' చైర్మన్ రామకృష్ణ

ఏపీలో వరద బాధితుల సహాయార్థం దాతలు భారీ విరాళాలతో ముందుకు వస్తున్నారు. తాజాగా,భాష్యం విద్యాసంస్థల యాజమాన్యం రూ.4 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. భాష్యం విద్యాసంస్థల చైర్మన్ రామకృష్ణ నేడు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి విరాళం తాలూకు చెక్కును అందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు అభినందనలు తెలిపారు.

నేడు విరాళాలు అందించిన దాతల వివరాలు...

  • ఎస్ఆర్ఎం యూనివర్సిటీ-రూ.3 కోట్లు
  • ఏపీ రైస్ మిల్లర్ల సంఘం- రూ.2 కోట్లు
  • బెకామ్ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్- రూ.1.25 కోట్లు
  • విశాఖ పోర్ట్ ట్రస్ట్- రూ.1 కోటి
  • తులసీ సీడ్స్ అధినేత రామచంద్ర ప్రభు- రూ.1 కోటి
  • మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు- రూ.50 లక్షలు
  • డెక్కన్ ఫైన్ కెమికల్స్ డైరెక్టర్ కేవీఎల్పీ రాజు- రూ.50 లక్షలు
  • సప్తగిరి గ్రామీణ బ్యాంకు- రూ.32 లక్షలు
  • ఆర్ఎస్ కేఆర్ ఇంజినీరింగ్ కంపెనీ- రూ.25 లక్షలు
  • జయలక్ష్మి ఫెర్టిలైజర్స్- రూ.20 లక్షలు
  • యలమర్తి అవినాశ్- రూ.20 లక్షలు
  • సిరి సీడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆరుమిల్లి వివేక్- రూ.10 లక్షలు

More Telugu News