Road Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

CM Chandrababu shocked to know fatal accident in Chittoor district

  • చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
  • ఎనిమిది మంది మృతి
  • క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్న సీఎం చంద్రబాబు
  • బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని వెల్లడి

చిత్తూరు జిల్లాలో ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఎనిమిది మంది మృత్యువాత పడడం పట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆయన ఆరా తీశారు. సహాయక చర్యలు, బాధితులకు అందుతున్న వైద్య సాయంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 

గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు సంతాపం తెలియజేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని పేర్కొన్నారు.

More Telugu News