Padi Kaushik Reddy: చంద్రబాబు ట్రాప్‌లో రేవంత్ రెడ్డి పడ్డారు: పాడి కౌశిక్ రెడ్డి

Padi Koushik Reddy fires at Revanth Redy

  • కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ అభివృద్ధి జరగకుండా కుట్ర చేస్తున్నారని విమర్శ
  • ఆంధ్రావాళ్లను తిట్టినట్లు ప్రచారం చేయడం దారుణమని మండిపాటు
  • అమరావతికి పెట్టుబడులు డైవర్ట్ చేసే కుట్రలో రేవంత్ రెడ్డి భాగమయ్యాడని వ్యాఖ్య

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు ట్రాప్‌లో పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. శంభీపూర్ రాజుతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ అభివృద్ధి జరగకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తాను ఆంధ్రా సెటిలర్స్‌ను దూషించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

అరికెపూడి గాంధీనే తన పట్ల ఇష్టారీతిగా మాట్లాడారని, పైగా తన వ్యాఖ్యలను వక్రీకరించారని మండిపడ్డారు. తానేదో ఆంధ్రా వాళ్లను తిట్టినట్లుగా ప్రచారం చేయడం దారుణమన్నారు. చిల్లర రాజకీయం కోసం ఆంధ్రా, తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టి హైదరాబాద్ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నారన్నారు.

ఇప్పటికే హైడ్రా పేరుతో హైదరాబాద్‌లో భవనాలు కూలగొట్టి నగరం ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్ కుట్రలను హైదరాబాద్ ప్రజలు గమనించాలని కోరారు. 

కేసీఆర్ పదేళ్లలో హైదరాబాద్‌ను అద్భుతంగా అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ నష్టం చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు ట్రాప్‌లో పడిన రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి అమరావతికి పెట్టుబడులను డైవర్ట్ చేసే కుట్రలో భాగం అయ్యాడని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తన స్థాయిని గుర్తించాడని, అందుకు ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. ఈరోజు నుంచి రేవంత్ రెడ్డికి కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు అవసరం లేదని, తాను చాలునని వ్యాఖ్యానించారు. ఇక నుంచి రేవంత్ రెడ్డి వర్సెస్ కౌశిక్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం తాను చావడానికైనా సిద్ధంగా ఉన్నానని... కాంప్రమైజ్ కావడానికి సిద్ధంగా లేనన్నారు.

Padi Kaushik Reddy
Revanth Reddy
Congress
Telangana
  • Loading...

More Telugu News