Ancient Bible: ఈ బైబిల్ ధర రూ.57 కోట్లు!

Ancient Bible fetched Rs 57 crores in auction

  • 14వ శతాబ్దం నాటి బైబిల్ కు కళ్లు చెదిరే ధర
  • 1312వ సంవత్సరంలో బైబిల్ ను గ్రంథస్తం చేసిన రబ్బీ షెంతోవ్ ఇబ్న్ గావ్
  • న్యూయార్క్ లోని సోత్ బీ సంస్థ వేలం

క్రైస్తవుల పవిత్ర గ్రంథం బైబిల్. దేవుని వాక్యాలతో కూడిన బైబిల్ గ్రంథాన్ని చాలా వరకు ఉచితంగానే అందిస్తుంటారు. అయితే ఓ బైబిల్ రూ.57 కోట్ల ధర పలకడం విశేషం అని చెప్పుకోవాలి. 

ఇది 14వ శతాబ్దం నాటి బైబిల్. దీన్ని స్పెయిన్ కు చెందిన రబ్బీ షెంతోవ్ ఇబ్న్ గావ్ రాశారు. 1312వ సంవత్సరంలో స్పెయిన్ లోని సోరియా ప్రాంతంలో ఆయన ఈ పుస్తకం పూర్తి చేశారు. 

ఇది 800 పేజీల బైబిల్. పాండిత్యం, పదాల ఎంపిక, సాంస్కృతిక కళాత్మకత వంటి అంశాల కలబోత ఈ బైబిల్ అని చెప్పవచ్చు. న్యూయార్క్ లోని సోత్ బీ వేలం కేంద్రంలో ఈ పురాతన బైబిల్ ను వేలం వేయగా, కళ్లు చెదిరే ధరను సొంతం చేసుకుంది.

  • Loading...

More Telugu News