Devara: 'దేవ‌ర‌'కు అరుదైన ఘ‌న‌త‌

Devara Movie to be Presented in California Film Festival

  • హాలీవుడ్ ఫిలిం ఫెస్టివ‌ల్ 'బియాండ్‌ ఫెస్ట్‌'లో  ‘దేవ‌ర’ ప్ర‌ద‌ర్శ‌న‌
  • సెప్టెంబర్‌ 26 సాయంత్రం ఈజిప్షియన్‌ థియేటర్‌లో ప్ర‌ద‌ర్శితం కానున్న మూవీ
  • ఈ నెల 27న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న 'దేవ‌ర‌'
  • అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్న‌ ఇప్ప‌టికే విడుద‌లైన 'దేవ‌ర' సాంగ్స్‌, ట్రైల‌ర్, గ్లింప్స్

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌, యంగ్ టైగ‌ర్ ఎన్‌టీఆర్ కాంబోలో వ‌స్తున్న తాజాచిత్రం 'దేవ‌ర‌'. 'జన‌తా గ్యారేజ్' వంటి సూప‌ర్ హిట్‌ త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూవీ కావ‌డంతో దీనిపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే ఇప్ప‌టికే విడుద‌లైన 'దేవ‌ర' సాంగ్స్‌, ట్రైల‌ర్, గ్లింప్స్ అభిమానుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటున్నాయి. 

ఇక రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ భారీ పాన్‌ ఇండియా మూవీ మొద‌టి పార్టు సెప్టెంబ‌ర్ 27న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్ బుకింగ్స్ మొద‌లు కాగా.. 1 మిలియ‌న్‌కు పైగా టికెట్లు బుక్ కావ‌డం విశేషం. త‌ద్వారా నార్త్‌ అమెరికన్‌ బాక్సాఫీస్‌ వద్ద అత్యంత వేగంగా టికెట్ల ప్రీసేల్‌ ద్వారా వన్‌ మిలియన్‌ మార్క్‌ దాటిన సినిమాగా రికార్డుకెక్కింది. 

కాగా, ఈ చిత్రం తాజాగా ఓ అరుదైన ఘ‌న‌త సాధించింది. కాలిఫోర్నియాలోని లాస్‌ ఏంజెలిస్‌ వేదికగా ప్రారంభం కానున్న అతిపెద్ద ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 'బియాండ్‌ ఫెస్ట్‌'లో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. సెప్టెంబర్‌ 25 నుంచి అక్టోబర్‌ 9 వరకు ఈ ఈవెంట్ జరగనుంది. కాగా, సెప్టెంబర్‌ 26 సాయంత్రం ఈజిప్షియన్‌ థియేటర్‌లో అక్కడి ప్రేక్షకులతో పాటు ప్రముఖులు కూడా ఈ చిత్రాన్ని వీక్షించనున్నారు.

మ‌రోవైపు ఈ చిత్రం సెన్సార్ ప‌నులు కూడా పూర్తిచేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డు యూ/ఏ (U/A) సర్టిఫికెట్‌ జారీ చేసింది. కాగా, సినిమా రన్ టైమ్ 2 గంటల 57 నిమిషాల 58 సెకన్ల పాటు ఉండనుంది. ఇక చిత్రంలో విజువల్స్‌ అద్భుతంగా ఉంటాయని, చివరి 40 నిమిషాలు సినిమాలో హైలైట్‌ అని హీరో తార‌క్‌ ముంబయిలో జరిగిన ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో చెప్పి అంచనాలు రెట్టింపు చేశారు. దీంతో దేవ‌ర కోసం మూవీ ల‌వ‌ర్స్ ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు.

  • Loading...

More Telugu News