Death Penalty: ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో దోషికి మరణశిక్ష

 Death penalty to victim who raped and killed six year old girl

  • గతేడాది అక్టోబర్ 16న బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు
  • ఆపై ఎవరికైనా చెబుతుందన్న భయంతో హత్య
  • నిందితుడు బీహార్‌కు చెందిన గఫార్ అలీఖాన్ 
  • 11 నెలల్లోనే తీర్పు వెలువరించిన న్యాయస్థానం

ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి సంగారెడ్డిలోని పోక్సో కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. కేసు పూర్వపరాల్లోకి వెళ్తే బీహార్‌కు చెందిన గఫార్ అలీఖాన్ (56) బీడీఎల్‌లో కూలిపనులు చేస్తుండేవాడు. గతేడాది ఆక్టోబర్ 16న సంగారెడ్డి జిల్లా బానూరు బీడీఎల్‌కు చెందిన ఆరేళ్ల బాలికకు కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి తాగించాడు. ఆపై పత్తి చేనులోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే, ఈ విషయాన్ని బాలిక ఎక్కడ బయటపెడుతుందోనని భయపడిన నిందితుడు ఆమెను హత్య చేసి పరారయ్యాడు. 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు గఫార్ అలీఖాన్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. తాజాగా జరిగిన కేసు విచారణలో నిందితుడిని దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం అతడికి మరణశిక్ష విధించింది. అలాగే, బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని న్యాయాధికారి జయంతి ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తీర్పు వెలువరించారు. కేవలం 11 నెలల్లోనే ఈ కేసులో శిక్ష పడడం గమనార్హం.

  • Loading...

More Telugu News