Bigg Boss: గత రికార్డులను బద్దలు కొట్టిన బిగ్ బాస్-8 ఓపెనింగ్ ఎపిసోడ్

bigg boss telugu season 8 grand launching episode gets top rating in tevision history

  • బిగ్ బాస్ – 8 లాంచింగ్ ఎపిసోడ్‌కు 18.9 టీఆర్పీ రేటింగ్ 
  • సోషల్ మీడియా వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేసిన హోస్ట్ నాగార్జున
  • ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంలో మరిన్ని కొత్త ప్రమాణాలు ఏర్పాటు చేస్తున్నామన్న నాగార్జున

టాలీవుడ్ అగ్రనటుడు అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ -8 రియాలిటీ షో లాంచింగ్ ఎపిసోడ్ 18.9 టీఆర్పీతో గత  రికార్డులను బద్దలు కొట్టింది. ఈ విషయాన్ని సంతోషంగా హోస్ట్ నాగార్జున సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.  

‘5.9 బిలియన్ నిమిషాల రికార్డు బ్రేకింగ్ వ్యూస్. ఎంటర్‌టైన్మెంట్ పవర్ ఇలా ఉంటుంది. బిగ్ బాస్ తెలుగు 8 రేటింగ్ ల రికార్డులను బద్దలు కొట్టింది. బిగ్ బాస్ కొత్త శిఖరాలకు చేరుకునేలా చేసిన మీ ప్రేమాభిమానాలను చూసి మాకెంతో సంతోషంగా ఉంది. ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంలో మేం మరిన్ని కొత్త ప్రమాణాలు ఏర్పాటు చేస్తున్నాం’ అని నాగార్జున పేర్కొన్నారు. మరో పక్క బిగ్ బాస్ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

అట్టహాసంగా జరిగిన బిగ్ బాస్ -8 ఓపెనింగ్ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్‌తో పాటు సినీ సెలబ్రిటీలు సందడి చేశారు. న్యాచురల్ స్టార్ నాని, రానా దగ్గుబాటి, నివేదా థామస్, అనిల్ రావిపూడి వంటి స్టార్స్ వచ్చి బిగ్ బాస్ షోలో మరింత ఉత్సాహాన్ని నింపారు.

More Telugu News