Uttam Kumar Reddy: సతీసమేతంగా ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy and his wife met AP CM Chandrababu in Amaravati

  • అమరావతి విచ్చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి
  • హార్దికస్వాగతం పలికిన సీఎం చంద్రబాబు
  • ఇది మర్యాదపూర్వక భేటీ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి

తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు సతీసమేతంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ ఏపీ రాజధాని అమరావతి విచ్చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఉత్తమ్ కుమార్ దంపతులకు చంద్రబాబు హార్దికస్వాగతం పలికారు. అనంతరం, పలు అంశాలపై వారు ముచ్చటించుకున్నారు.

ఈ భేటీపై ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఇవాళ తన భార్య, కోదాడ ఎమ్మెల్యే పద్మావతితో కలిసి చంద్రబాబుతో సమావేశమయ్యానని వెల్లడించారు. ఇది మర్యాదపూర్వక భేటీ అని తెలిపారు. 

ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం పట్ల, నాలుగోసారి ముఖ్యమంత్రి కావడం పట్ల చంద్రబాబును అభినందించానని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. 

More Telugu News