Sitaram Yechury: సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని ఎయిమ్స్ కు దానం చేసిన కుటుంబ సభ్యులు

Family donates Sitaram Yechury mortal remains to AIIMS
  • తీవ్ర అనారోగ్యంతో సీతారాం ఏచూరి కన్నుమూత
  • వైద్య విద్యార్థులకు బోధనలో భౌతికకాయం ఉపయోగించుకోవాలన్న కుటుంబం 
  • ఓ ప్రకటన ద్వారా వెల్లడించిన ఢిల్లీ ఎయిమ్స్
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నేడు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఆయన... ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. 

కాగా, ఆయన భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు ఎయిమ్స్ (ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)కు దానం చేశారు. వైద్య విద్యను అభ్యసించే విద్యార్థుల బోధన, రీసెర్చ్ లో ఏచూరి భౌతికకాయాన్ని ఉపయోగించుకోవాలని కుటుంబ సభ్యులు ఎయిమ్స్ ను కోరారు. ఈ విషయాన్ని ఢిల్లీ ఎయిమ్స్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.
Sitaram Yechury
Mortal Remains
AIIMS
Family
New Delhi
CPM
India

More Telugu News