Vivo T3 Ultra: భారత్‌ విపణిలో వివో కొత్త ఫోన్ విడుదల

Vivo has launched a new smartphone Vivo T3 Ultra in India

  • వివో టీ3 అల్ట్రా ఫోన్‌ను విడుదల చేసిన వివో కంపెనీ
  • అధునాతన ఫీచర్లతో తీసుకొచ్చిన కంపెనీ
  • ప్రారంభ ధర రూ.31,999గా ప్రకటన
  • సెప్టెంబర్ 19 నుంచి షురూ కానున్న విక్రయాలు

స్మార్ట్‌ఫోన్ల దిగ్గజం వివో భారత విపణిలో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఇటీవల కొత్తగా ఆరంభించిన వివో టీ3 సిరీస్‌లో భాగంగా ‘వివో టీ3 అల్ట్రా ఫోన్‌’ను గురువారం విడుదల చేసింది. ఈ సిరీస్‌లో ఇప్పటికే వివో టీ3 ప్రో, వివో టీ3 లైట్, వివో T3 ప్రో, వివో టీ3ఎక్స్, వివో టీ3 ఫోన్లు విడుదలవ్వగా కొత్తగా దీనిని జోడించింది. 

6.78-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, 50 ఎంపీ ఆటోఫోకస్ ఫ్రంట్ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 9200ప్లస్ ప్రాసెసర్, 80వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో కూడిన పలు ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. వివో టీ3 అల్ట్రా ఫోన్ లూనార్ గ్రే, ఫ్రాస్ట్ గ్రీన్ రంగులలో అందుబాటులో ఉంది.

ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఈ ఫోన్ రన్ అవుతుంది. 120 హెట్జ్ రిఫ్రెష్ రేట్‌, 4500 నిట్స్ బ్రైట్‌నెస్ ఫీచర్లు ఉన్నాయి. ఇక కెమెరా విషయానికి వస్తే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 ఎంపీ ఆటోఫోకస్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో పాటు 8 ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరాను అందించింది. ఇతర ఫీచర్ల విషయానికి వస్తే ఫింగర్ ప్రింట్ సెన్సర్, యూఎస్‌బీ టైప్-సీ, స్టీరియో స్పీకర్లు ఉన్నాయి.

ఈ ఫోన్ ధర విషయానికి వస్తే 8జీబీ+ 128జీబీ వేరియంట్ ఫోన్ ధర రూ.31,999గా ఉంది. 8జీబీ+ 256జీబీ వేరియంట్ ఫోన్ రేటు రూ.33,999గా ఉంది. ఇక టాప్ వేరియెంట్ 12జీబీ + 256జీబీ మోడల్ ధర రూ.35,999గా ఉందని కంపెనీ వెల్లడించింది. 

సెప్టెంబర్ 19న రాత్రి 7 గంటలకు ఈ ఫోన్ విక్రయాలు మొదలవుతాయి. వివో అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ కార్డ్‌లు ఉపయోగించి కస్టమర్లు రూ.3,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చని కంపెనీ తెలిపింది. అంతేకాదు రూ.3,000 ఎక్స్చేంజీ బోనస్ కూడా పొందొచ్చు.

  • Loading...

More Telugu News