Pawan Kalyan: సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan wrote CM Chandrababu

  • కూటమి ప్రభుత్వం వచ్చాక పవన్ కు విజయవాడలో క్యాంపు కార్యాలయం
  • అయితే మంగళగిరి నివాసం నుంచే కార్యకలాపాలు సాగించాలని పవన్ నిర్ణయం
  • విజయవాడ క్యాంపు కార్యాలయ భవనాన్ని, ఫర్నిచర్ ను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నేడు లేఖ రాశారు. మంగళగిరిలోని తన నివాసాన్ని ఇకపై క్యాంపు కార్యాలయంగానూ ఉపయోగించుకుంటానని వెల్లడించారు. అందుకే, విజయవాడలో కేటాయించిన క్యాంపు కార్యాలయాన్ని, ఫర్నిచర్, ఇతర సామగ్రి సహా వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని పవన్ తన లేఖలో పేర్కొన్నారు. 

విజయవాడలో ఎంతో విశాలమైన క్యాంపు కార్యాలయాన్ని తనకు కేటాయించడం పట్ల చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, ఇకపై మంగళగిరిలోని నివాసం నుంచే కార్యకలాపాలు కొనసాగించాలని నిర్ణయించుకున్నందున, విజయవాడ క్యాంపు కార్యాలయాన్ని ప్రభుత్వానికి తిరిగి అప్పగిస్తున్నానని జనసేనాని వివరణ ఇచ్చారు. 

Pawan Kalyan
Chandrababu
Camp Office
Vijayawada
Janasena
TDP-JanaSena-BJP Alliance
  • Loading...

More Telugu News