Padi Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత... అరికెపూడి గాంధీ అరెస్ట్

Arikepudi Gandhi arrested

  • పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చిన అరికెపూడి గాంధీ
  • కౌశిక్ రెడ్డి ఇంటి బయట అనుచరులతో కలిసి బైఠాయింపు
  • కౌశిక్ రెడ్డి ఇంటి గేటును ఎక్కేందుకు ప్రయత్నించిన గాంధీ అనుచరులు

హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసానికి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వచ్చారు. రెండు రోజులుగా ఇరువురు నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. 

కౌశిక్ రెడ్డి ఇంటికి గాంధీ వెళ్లడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కౌశిక్ రెడ్డి నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. గాంధీ అనుచరులు కొంతమంది కౌశిక్ రెడ్డి ఇంటి గేటు ఎక్కి లోనికి వెళ్లే ప్రయత్నం చేశారు.

ఆ తర్వాత కౌశిక్ రెడ్డి ఇంటి ఎదుట అనుచరులతో కలిసి బైఠాయించారు. అరికెపూడి గాంధీకి పోలీసులు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. కానీ ఆయన ససేమిరా అన్నారు. కౌశిక్ రెడ్డిని బయటకు రప్పించాలని లేదంటే తనను లోనికి పంపించాలని పోలీసులను కోరారు. ఈ క్రమంలో పోలీసులు, గాంధీ అనుచరుల మధ్య తోపులాట జరిగింది. అనంతరం, పోలీసులు అరికెపూడి గాంధీని అరెస్ట్ చేశారు.

Padi Kaushik Reddy
Arikepudi Gandhi
Telangana
BRS
  • Loading...

More Telugu News