YS Jagan: అభిమానినంటూ జైలు వద్ద జగన్‌తో మహిళా కానిస్టేబుల్ సెల్ఫీ... సోషల్ మీడియాలో వైరల్

Woman constable selfie with ys jagan

  • గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ సురేశ్‌ను పరామర్శించిన జగన్
  • జగన్ బయటకు రాగానే అభిమానిని అంటూ వచ్చిన మహిళా కానిస్టేబుల్
  • కూతురుతో కలిసి జగన్‌తో సెల్ఫీ దిగిన కానిస్టేబుల్

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తో ఓ మహిళా కానిస్టేబుల్ సెల్ఫీ దిగడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. మీ అభిమానిని అంటూ సదరు కానిస్టేబుల్ జగన్ వద్దకు వెళ్లి సెల్ఫీ తీసుకున్నారు.

జగన్ నిన్న గుంటూరు జిల్లా కారాగారంలోకి వెళ్లి మాజీ ఎంపీ నందిగం సురేశ్, విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాస్ రెడ్డిని పరామర్శించారు. జైల్లో వారిని పరామర్శించి ఆయన బయటకు వచ్చిన సమయంలో... అదే కారాగారంలో విధులు నిర్వహిస్తున్న అనంతపురంకు చెందిన మహిళా కానిస్టేబుల్ ఆయేషా బాను జగన్ వద్దకు దూసుకువచ్చి సెల్ఫీలు దిగారు. ఆమె తన కూతురుతో కలిసి జగన్ వద్దకు వచ్చారు. జగన్ వారితో కలచాలనం చేసి సెల్ఫీ దిగారు.

YS Jagan
Andhra Pradesh
Social Media
Constable
  • Loading...

More Telugu News