Shivraj Singh Chouhan: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని వరద నష్టంపై అమిత్ షాకు శివరాజ్ సింగ్ నివేదిక

Shivaraj Singh gave report to Amit Shah on Ap telangana floods

  • భారీ వరదల కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర నష్టం
  • ఇటీవల ఏరియల్ సర్వే నిర్వహించిన శివరాజ్ సింగ్ చౌహాన్
  • అమిత్ షాకు నివేదిక సమర్పించినట్లు ట్వీట్ చేసిన కేంద్రమంత్రి

ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని నష్టంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు నివేదికను సమర్పించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలలో ఏరియల్ సర్వే నిర్వహించారు. దీనికి సంబంధించిన ప్రాథమిక నివేదికను అమిత్ షాకు సమర్పించారు.

ఏపీ, తెలంగాణ వరద ప్రభావానికి సంబంధించి తాను అమిత్ షాకు నివేదికను సమర్పించానని శివరాజ్ సింగ్ చౌహాన్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. త్వరలో కేంద్ర బృందాలు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తాయని వెల్లడించారు. ఏపీ, తెలంగాణలకు కేంద్రం నుంచి ఆర్థిక సహాయం అందుతుందన్నారు.

More Telugu News