Vande Bharat Train: అతడెందుకు వందేభారత్ అద్దం పగులగొడుతున్నాడు?... ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది!

Video of man smashes Vande Bharat train glass with hammer went viral

 


సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో వైరల్ అయింది. ఓ యువకుడు సుత్తితో వందేభారత్ రైలు అద్దాన్ని పగులగొడుతుండడం ఆ వీడియోలో కనిపించింది. అయితే, ఆ యువకుడు ఎందుకు వందేభారత్ అద్దాన్ని పగులగొడుతున్నాడంటూ సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. 

దీనిపై రకరకాల అభిప్రాయాలు వెలువడ్డాయి. అద్దం పగులగొడుతున్న యువకుడ్ని అరెస్ట్ చేయాలని కొందరు నెటిజన్లు పేర్కొన్నారు. ఆ యువకుడు ఎవరు? అద్దం పగులగొట్టడానికి కారణం ఏంటి? అది ఏ స్టేషన్? ఆ వందేభారత్ రైలు ఎక్కడ్నించి ఎక్కడికి వెళుతోంది? ఇలా రకరకాల ప్రశ్నలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

అయితే, దీనికి సమాధానం దొరికింది. ఆ వందేభారత్ రైలు ఉన్నది స్టేషన్ కాదని, ఓ ట్రైన్ కోచ్ కేర్ సెంటర్ అని వెల్లడైంది. 

ఆ కుర్రాడు ఓ కాంట్రాక్టర్ వద్ద పనిచేసే ఉద్యోగి అని, పాడైపోయిన అద్దాన్ని మరో కొత్త అద్దంతో భర్తీ చేసేందుకు... పాత అద్దాన్ని ఆ విధంగా సుత్తితో కొట్టి తొలగిస్తున్నాడని తెలిసింది. ఈ ఏదేమైనా ఈ వీడియోకు మాత్రం లైకులు, షేర్లు మామూలుగా లేవు.

More Telugu News